Google Family Link మీ ఫ్యామిలీని ఆన్‌లైన్‌లో సేఫ్ గా ఉంచగలిగే తల్లిదండుల కంట్రోల్స్ యాప్. ప్రతి ఫ్యామిలీకి టెక్నాలజీతో సంబంధం భిన్నంగా ఉంటుంది. అందుకే, సరైన బ్యాలెన్స్ ఎంచుకోవడం, ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లు ఏర్పరచుకోవడంలో సహాయపడేందుకు మేము టూల్స్ బిల్డ్ చేస్తాము. మీ చిన్నారి డివైజ్‌లో సమయం ఎలా గడుపుతున్నారో చూడడానికి, లొకేషన్ తెలుసుకోవడానికి, గోప్యతా సెట్టింగ్‌లు మేనేజ్ చేయడానికి తదితరాల కోసం యాప్ ఉపయోగించవచ్చు.
Family Linkతో మీరు ఇవి చేయవచ్చు:
డిజిటల్ నియమాలను ఏర్పరచవచ్చు
• స్క్రీన్ టైమ్ పరిమితులను సెట్ చేయడం — మీ చిన్నారికి తగిన స్క్రీన్ టైమ్‌ను కనుగొనడం. Family Linkతో, మీరు స్కూల్ టైమ్, డౌన్‌టైమ్, డైలీ టైమ్ లిమిట్స్ సెట్ చేసి, చిన్నారి లైఫ్‌స్టైల్‌ను ఆరోగ్యకరంగా ఉంచవచ్చు.
• యాప్ వాడకాన్ని మేనేజ్ చేసి, అవసరమైన సౌలభ్యం కల్పించండి. విద్య, ఇతర యాప్‌లకు విడివిడిగా సమయ పరిమితులు లేదా అపరిమిత సమయం సెట్ చేయండి. యాప్‌లను బ్లాక్ చేయండి.
కంటెంట్ ఫిల్టర్‌లు, సెక్యూరిటీ, గోప్యతను మేనేజ్ చేయండి
• Chrome, Play, YouTube, Searchలో తల్లిదండ్రుల కంట్రోల్స్ సెటప్ చేసి, వారు ఆన్‌లైన్‌లో చూసేవి మేనేజ్ చేయండి. Family Linkతో అనుచిత సైట్‌లు బ్లాక్ చేయండి, కొత్త యాప్‌లకు ఆమోదం ఇవ్వండి, యాప్‌లు–వెబ్‌సైట్‌ల అనుమతుల వంటివి మేనేజ్ చేయండి.
• వారి ఖాతా, డేటా సెట్టింగ్‌లను మేనేజ్ చేసి సురక్షితంగా ఉంచండి. తల్లి/తండ్రిగా, మీ చిన్నారి పాస్‌వర్డ్ మార్చడం, రీసెట్ చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని ఎడిట్ చేయడం లేదా ఖాతాను తొలగించడంలో సహాయం చేయవచ్చు.*
*వర్తించే వయోపరిమితి ఎక్కువ అయితే వారు తమ ఖాతాను స్వయంగా మేనేజ్ చేయవచ్చు.
ప్రయాణంలో కనెక్ట్ అయి ఉండండి
• వారు ఎక్కడ ఉన్నారో చూడండి — Family Linkతో, మీరు పిల్లలను, వారు తమ డివైజ్ తీసుకెళ్లినట్లయితే, ఒకే మ్యాప్‌లో లొకేట్ చేయవచ్చు.
• నోటిఫికేషన్‌లు పొందండి — పిల్లలు లొకేషన్ చేరుకున్నా లేదా వెళ్లినా Family Link నుండి ముఖ్యమైన అలర్ట్‌లు వస్తాయి. మీరు డివైజ్‌లను రింగ్ చేయవచ్చు, డివైజ్ మిగిలిన బ్యాటరీ లైఫ్‌ను కూడా చూడవచ్చు.
ముఖ్యమైన సమాచారం
• మీ చిన్నారి డివైజ్‌ను బట్టి Family Link టూల్స్ మారుతూ ఉంటాయి. అనుకూల డివైజ్‌ల లిస్ట్‌ను https://families.google/familylink/device-compatibility/
లో చూడండి • మీ చిన్నారి Google Play నుండి కొనుగోళ్లను, డౌన్‌లోడ్‌లను మేనేజ్ చేయడంలో Family Link మీకు సహాయం చేస్తుంది, అయితే యాప్ అప్‌డేట్‌లు (అనుమతులను విస్తరించే అప్‌డేట్‌లతో సహా), మీరు గతంలో ఆమోదించిన యాప్‌లు లేదా ఫ్యామిలీ లైబ్రరీలో షేర్ చేయబడిన యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి వారికి ఆమోదం అవసరం లేదు. అదనంగా, మీ చిన్నారి Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా కొనుగోలు చేసినప్పుడు మాత్రమే కొనుగోలు ఆమోదాలు వర్తిస్తాయి, ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌ల ద్వారా చేసే కొనుగోళ్లకు వర్తించవు. తల్లిదండ్రులు Family Linkలో తమ పిల్లల ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు, యాప్ అనుమతులను క్రమం తప్పకుండా రివ్యూ చేయాలి.
• మీ చిన్నారి పర్యవేక్షించబడే డివైజ్‌లోని యాప్‌లను మీరు జాగ్రత్తగా రివ్యూ చేయాలి, వారు ఉపయోగించకూడదనుకునే వాటిని నిలిపివేయాలి. మీరు Play, Google మొదలైన కొన్ని ముందే ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను డిజేబుల్ చేయలేకపోవచ్చని గుర్తుంచుకోండి.
• మీ చిన్నారి లేదా యుక్తవయస్కుల డివైజ్ లొకేషన్‌ను చూడటానికి, డివైజ్ తప్పనిసరిగా ఆన్ చేయబడి, ఇటీవల యాక్టివ్‌గా ఉండి, డేటా లేదా wifi ద్వారా ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయి ఉండాలి.
• Family Link తల్లిదండ్రుల కంట్రోల్స్, పర్యవేక్షించబడే Google ఖాతాలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పర్యవేక్షించబడే Google ఖాతాలతో, పిల్లలు Search, Chrome, Gmail వంటి Google ప్రోడక్ట్‌లకు యాక్సెస్‌ను పొందుతారు, తల్లిదండ్రులు వాటిని పర్యవేక్షించడానికి ప్రాథమిక డిజిటల్ నియమాలను సెటప్ చేయవచ్చు.
• Family Link మీ పిల్లల ఆన్‌లైన్ అనుభవాన్ని మేనేజ్ చేయడానికి వారిని ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంచడానికి టూల్స్‌ను అందించినప్పటికీ, ఇది ఇంటర్నెట్‌ను సురక్షితంగా చేయదు. Family Link ఇంటర్నెట్‌లోని కంటెంట్‌ని గుర్తించలేదు, కానీ అది వారి పిల్లలు తమ డివైజ్‌లో సమయాన్ని ఎలా గడుపుతారో, మీ ఫ్యామిలీ ఆన్‌లైన్ భద్రతకు ఏ పాత్ ఉత్తమంగా ఉంటుందో నిర్ణయించడానికి తల్లిదండ్రులకు అవకాశం ఇస్తుంది.
అప్‌డేట్ అయినది
30 ఏప్రి, 2025